పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

191


పరమపావనవారిభరిత మౌ నొక్క-
సరసి చెంత దపంబు సలుపుచు నుండె360.
అయ్యమ యొక్క నాఁ డాత్మజుఁ దలఁచి
నెయ్యంబునన్ చింత నిగుడంగ వగచి
ఫాలాక్షుఁ జూచి యో పన్నగాభరణ
బాలు నా షణ్ముఖుఁ బరదేశమునకు
బనిచితి వటుల నా బాలుఁ డేలాగు
ఘనతపం బొనరించఁ గలుగునో యెదను
మాయావి యవ్వెన్నుమది నైనఁ గనఁగ
నే యోగిచంద్రులు నే మునీంద్రులును
నేరరు గన నేర్తు వీ వొక్కరుఁడవె
సారతరజ్ఞానశాలి వౌ కతన370.
నట్టి పద్మాక్షుఁ బ్రత్యక్షమై గాంచు
నెట్టుల బాలకుం డిది దుర్ఘటంబు
సుకుమారమూర్తి నీసుతుఁ డుగ్రమైన
ప్రకటతపం బెట్లు బహువత్సరములు
నొంటి నెట్టుల సల్పు నుల్కునో నాదు
కంటికి నొక యింత కలుగదు నిద్ర
దిగులయ్యెడి ని దేమొ తీరనిచింత
జగదీశ తీర్పవే సదయత నీవు
అనుచు [1] వెడందలై యలరు కన్నులను
మొనయు నశ్రులు గోటిమొనను జిమ్ముచును380.
పదనఖంబున నేలపై లిఖింపుచును
వదనం బటు నొకింత వాల్చి బల్ చింతఁ

  1. "అనుచు వేడం దలై " వ్రా .ప్ర. పాఠము.