పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

173


పూర్తధర్మము హరిపూజనక్రియలు
కీర్తనంబును యోగకృతి మొద లెట్టి
వైన ననంతఫలావాప్తిసలుపు
శ్రీనివాసుల కతిప్రియము నొనర్చు
సులభమయ్యు ననంతశుభదధర్మంబు
కలదు రహస్య మొక్కటి దెల్పె దిపుడు960.
బృందావనం బందుఁ బెనుపొందఁజేసి
ఇందిరాప్రియపూజ కెనయింతురేని
యొక దళం బర్పించి యుగసహస్రములు
ప్రకటవైభవముతో బ్రహ్మలోకంబు
నను నిచ్చ హరికథాధ్యానపారీణ
ఘనమతి సన్మౌనికలితయోగమున
విహరించి తుద ముక్తి విష్ణుసారూప్య
సహితులై చేకొండ్రు సత్య మెంతయును
అచటఁ దటాకాన ధ్యానాదికములు
రచియించువారికి రహి నందు నెట్టి970.
కారణంబుననైన కాపురంబుగను
వారక నిత్యనివాసంబు సేయు
వారికి వారికిన్ వరధనాద్యోప
కారకారకులైన ఘనులకున్ సమత
శ్రీనివాసు లభీష్టసిద్ధి గావించి
యూనినదయ మోక్ష మొసఁగును తుదను
నానోక్తు లేల నా నారాయణాద్రి
పైనఁ బుట్టిన మృగపక్షికీటాది