పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

శ్రీనివాసవిలాససేవధి


చామరంబులు ఘనసారకుంకుమము
లొమజ్జసురభికృష్ణాగరుమలయ
జాతంబులున్ పునుగుచట్టంపుగములు
జాతిజవ్వాది నిచ్చలపుకస్తూరి
వీణెలు నవరత్నవిరచితచిత్ర
వీణెలు వల్లకుల్ వివిధవాద్యములు
యేలాలవంగము లింగునల్ ద్వీప
జాలసంభవము లౌ సకలవస్తువులు
కానుకల్ సేయంగఁ గరుణించి వారి
శ్రీనివాసులు సుతశ్రీవైభవాది940
వరములు బాలించి వరుసలాలించి
సరగ నందఱి స్వదేశములకు ననిచె.
అటుల శ్రీ వేంకటాధ్యక్షునికరుణఁ
జటులసంపద లఁది సకలలోకులును
జలజనాభుని మహోత్సవసంభ్రమములు
తలంచితలంచి యెంతయు సంతసమున
పొగడుచు నన్యోన్యములు పల్కుకొనుచు
మగుడంగలేని తన్మయభావములను
మరలి చూచుచును శ్రీ మద్వేంకటాద్రి
దరలిపోయిరి జనస్థానముల్ చేర 950

వేంకటాచలమహిమ.


కావుననట్టి వేంకటధరాధరము
పావన మఖిలసంపత్కారణంబు
వినుఁ డందుఁ గావించు విమలవ్రతంబు
మనుజపంబు తపంబు మఘము దానంబు