పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

171


స్వామి పుష్కరిణిలో స్నానంబు సల్పు
నా మనుజుల కిత్తు సకలభాగ్యములు
వైకుంఠమున నాభవనమన నిదియె
నాకల్పమై యొప్పు నైరమ్మదాఖ్య910
సర మిందు స్వామి పుష్కరిణి నాఁ బ్రబలె
ధరణి గంగాదితీర్థములు నిందుండు
ప్రతివత్సరము నీవు పన్ను నుత్సవము
హితమతిఁ గైకొందు నిక శంక వలదు
సత్యం బగును నీదు సంకల్ప మెల్ల
సత్యలోకమునకు జనుము శంకరుఁడు
కైలాసగిరికేగుగాక నింద్రుండు
స్వాలయంబునఁ జేరు నఖిలదిక్పతులు
మౌనులున్ దమ తమ మందిరంబులకుఁ
బోని మ్మనుచుఁ బల్కి, భూషాంబరములు920
వరము లందఱికిని వరుసగా నొసఁగి
కరుణతో సెలవిచ్చి కడుపడిఁ బనిచె
వారు నప్పుడు శ్రీనివాసుల యాజ్ఞ
మీరక నేగి రవితసంభ్రమమున

కానుకలర్పించుజనులను శ్రీనివాసు లసుగ్రహించుట.


భూలోకజనము లప్పుడు శ్రీనివాసుఁ
జాల సేవించి యాశ్చర్యంబు గదుర
ధనములు మణులు ముక్తాదామములును
ఘనభూషణంబులు గజము లశ్వములు
చీనాంబరంబులు శిభిశెలు ధ్వజము
లా నవఛత్రంబు లాలవట్టికలు930