పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

శ్రీనివాసవిలాససేవధి


తరుతృణాంతమ్ము లౌ తామసజీవు
లరయంగ తుద మోక్షమంది ముకుందు980.
సారూప్యమున్ గని శౌరికైంకర్య
దౌరంధరి వహించుఁ దన్మహత్వంబు
నెంతని వర్ణింతు నెత నుతింతు
నెంతని నుడువుడు నెటుల నూహింతు
నని విచిత్రార్థసమర్ధనాకలిత
ఘనసర్గవిశ్రుతకవిముఖ్యుపేర
విపులానుభావభావితసంవిధాన
కపటనాటకజగత్కారణు పేర
భాసురాంగశ్రుతిభారతిభవ్య
లాసికాగీతవిలాసునిపేర990.
తారకాంతకపితృద్వంద్వా ద్యతీత
తారకమంత్రాభిధానునిపేర
ప్రత్యాహృతోత్తరాపత్యచైతన్య
సత్యనిత్యబ్రహ్మచర్యునిపేర
క్షీరపారావారసీకరాసార
పూరితనిజముఖాంభోజునిపేర
పావనభక్తాప్తబంధుని పేర
గోవిందరాజముకుందునిపేర
శ్రేష్ఠలూర్యన్వయ శ్రేష్ఠశీలుండు
ప్రేష్ఠమహాయశ శ్రీధురీణుండు1000.
గోత్రభారద్వాజగోత్రపర్థనుడు
సూత్రుఁడాపస్తంభసూత్రానువర్తి
అష్టభాషాకవిత్వార్జితప్రోద్య