పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

శ్రీనివాసవిలాససేవధి


నడ గడుగుకు దండ మటు బెట్టువారు
నెడపక తల బంగ రిల గట్టువారు
నోటితాళములఁ బూనుక వచ్చువారు
వాటమై తాళముల్ వాయించువారు
చప్పిడి భుజియించి జరిగెడువారు
చప్పరంబులు పూని చనుదెంచువారు
తమ్మటంబులు బెట్టు దాటించువారు
ముమ్మరమ్ముగ వాద్యములు మ్రోయువారు
గోవిందబెట్టుచు గునుకు వారలును
ఠీవి స్తోత్రములు పఠించువారలును700
పటుమతి హరికథల్ బలుకువారలును
కథ విని హర్షించి కథ మెచ్చువారు
కథకునకు ధనంబు కర మిచ్చువారు
రథములపై తమ రమణుల నుంచి
పథికులెడల బరాబరి సేయువారు
శకటంపురవణికి జదియుచు నకట
వికటంబుగా త్రుళ్లు వేసడంబులను
కని కరాళించు కంఖాణాళినుండి
వెనక మళ్లుగ ద్రుళ్లు వెలఁదుల నందు
కొని బుజ్జగించి మక్కువ వెస నుంచి710
మొన వాగెబూని యిమ్ముగ నేగువారు
సందడి నొక్క యుష్ట్రంబు కెర్లంగ
నం దళ్కు ప్రియురాండ్ర నలమెడువారు
నడుగుల నొవ్వికై యలయు కొమ్మలను
కడుఁగౌగిటన్ బూని కదలెడువారు