పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

163


గా ముజ్జగంబులఁ గల జీవులెల్ల
స్వామికి గణుతియ్య చనుదెంచుపగిది
వేగ జీవుల ధాత వెస నారుబోయు
లాగున నెందు తొలఁగ దొబ్బరాక
యరుదెంచి యటుగల యచ్చెరువెంచి720
దరులు కోనలు చరుల్ తరువులు లతలు
ఝరులు తటాకముల్ సరములు దొనలు
గిరిశిఖరంబులు కీచకతరులు
పొదరిండ్లు తుమ్మెదల్ పొదలు పూపొదలు
మృదునాదము లొనర్చు మృగ పక్షిగణముఁ
గనుఁగొంచు నందందు ఘనమంటపముల

చలువపందిళ్లు--ప్రపాపాలికలు



వనములన్ మేలైన పందిళ్ల నిలువ
నిసుకలో సగమంత యిడి తడివలువ
బొసగించి వేకువ బూరించు కడవ
నేలకుల్ కపురంపు నేనయించువిరులు
జాలనుసీరముల్ సవరింపఁ జల్ల730
దనము తావియు స్వాదుదగు నుదకంబు
ననటిబొందెల యొప్పు లాశొంఠిపొడియు
లికుచసారంబు దొర్లిన నీరుచల్ల
ప్రకటమాధురి మించి పరగు పానకము
వరుసగాఁ గై నేసి వలపు మీఱంగ
మరుని మోహనవిద్యమాడ్కిని నిల్చి
సలిలాధిదేవత చందంబు దాల్చి
జలదంబువలె మించు చల్వపందిలిని