పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

161


వేదమంత్రములను వివిధతంత్రములఁ
గలశప్రతిష్ఠానకంకణాంకురము
లలర నొనర్చి విహంగపుంగవుని670.
యావహింపించి ధ్వజారోహణంబు
గావించి దిగ్బలికర్మపూర్వముగ
తిరువీధు లేగించి దేవాధిదేవు
తిరునాళ్ల సవరింప దేశదేశముల
నుండి కుటుంబసంయుక్తులై తరలి
దండిగాఁ ద్రోవ లెంతయుఁ బిక్కటిల్ల

నానాదేశజనులరాక వారినడకలు


చోళద్రమిళపాండ్యసూరసేనాంధ్ర
మాళవకర్నాటమగధసౌవీర
మళయాళకొంకణ మత్స్యసౌరాష్ట్ర,
తుళువ లాటాంగసింధుకళింగహూణ680.
వంగమహారాష్ట్ర వై దర్భనిషధ
బంగాళ నేపాళ బర్బరయవన
కురుఘూర్జరోత్తర కోసల ప్రముఖ
ధరణీశ్వరులును తత్తద్రాష్ట్రజనులు
వరవాహనతురంగనాగశతాంగ
వరవృషభాదులౌ వాహనమ్ములను
దగ నధిరూఢులై దవ్వని సొలయ
కగణితసంతోష మడరంగ మదిని
తడయ కెంతయు భక్తిఁ దగ వచ్చువారు
కడు వస్తువులు కానుకలు దెచ్చువారు690.