పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

శ్రీనివాసవిలాససేవధి


లాతరువుల దివ్య మగు పక్షిగణము
గణితికెక్కుడుగాఁగఁ గల్పించి వేగఁ
బ్రణుతుఁడై బ్రహ్మ కాపని విన్నవించె
నంతట చతురాస్యుఁ డమరాధినాధుఁ
జెంతఁబిల్చి సురేంద్ర శీఘ్రంబు నీవు
హరిమహోత్సవమున కమరగంధర్వ
గరుడోరగాప్సరోగణముల నవనిఁ650
గల విప్రమహిపాదికప్రజాతతుల
విలసిల్ల దూతల వేవేగఁ బన్చి
రావించు మని పల్కి రాజరాజునకు
భావితసంభారభరముఁ దెప్పించ
సెలవిచ్చి మౌనులన్ జెలిమి నీక్షించి
తెలివిడి ముందును దెలియ నిట్లనియె
శ్రీనివాసులకు నే శ్రీమహోత్సవముఁ
బూని కావింప నంభోజమిత్రుండు
కన్యఁ జేకొని యుండఁగా శుక్లపక్ష
మాన్యవాసరముల మహనీయసరణి660

వైఖాన సాగమవిధులతో నుత్సవారంభము.



నారూఢి వైఖానసాగమనిధుల
నారంభ మొనరించుఁ డనుటయు వారు
శ్రీనివాసులకు నా శ్రీ భూములకును
స్నానార్చనా పరిష్కారాంగరాగ
వివిధాన్నభక్ష్యముల్ వేగఁ గావించి
సవరణ రాజోపచారముల్ సల్పి
వేదికాకుండముల్ వేయించి సకల