పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

శ్రీనివాసవిలాససేవధి


శ్రీనివాసుడు నస్త్రశేఖరుఁ గేలఁ
బూని మచ్చికలు నింపుగ నాదరించె550.

దేవతలు చక్రరాజు విక్రమము పొగడుట.



అందుండు నిందుజూ టాంభోజజాత
బృందారకేంద్ర కుబేరాంబునాథ
సమవర్తిసావకశ్వసనరక్షోధి
ప్రముఖ బర్హిర్ముఖ పటలంబు నత్రి
కలశజ కాశ్యప గర్గ వశిష్ట
పులహ కౌశికముఖ్య మునీసమూహంబు
నపు డట్టి చక్రరాజాతిశయంబు
విపులశౌర్యము నెంచి వినుతించి మఱియు
శ్రీ వేంకటాధీశు సేవించి మిగుల
భావించి కేల్మోడ్చి భక్తి నిట్లనిరి560.
పరమకారుణికస్వభావప్రభావ!
కరుణాకటాక్ష! వెంకటనగాధ్యక్ష!
ఈ చక్రవిక్రమం బెంచి చూడంగ
నా చక్రవాళంబు నం దొరుల్ దీటె
ఇతఁ డాజిఁ ద్రుంచిన యీ దైత్యవరులు
ప్రతిలేని బలపరాక్రమధురంధరులు
ఒకఁ డొకఁడే చాలు నుర్వీధరములఁ
బెకలించి బంతులు పేర్చి గోరింప
నొకఁ డొకఁడే చాలు నుడుగక కడలిఁ
గకబికగా వేగం గలఁచి యింకింప570.
నొకఁ డొకఁడే చాలు నుడువీధినంటి
ప్రకటకరాహతిన్ ప్రయ్యలుసేయ