పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

155

తృతీయాశ్వాసము.

155


పాశ్చాత్యుఁ డగుదైత్యుఁ బరిమార్చి గెలిచె
నిశ్చయింపగ నీతని చమూభరంబు
తరమె శేషునకై నఁదడని వర్ణింప
శరధుల నింకింపజాలు నొక్కరుఁడె
వీఁడె పావకుఁ డనువీరుండు సమితి
వాఁడిమీఱు ప్రతాపవంతుఁ డౌవాఁడు530
యోజనత్రితయసమున్నతు నసుర
రాజును నిమిషమాత్రమున నీల్గించె
నితని పతాకిని నెంచి లిఖింప
క్షితిఁ దాళపత్రముల్ చిగిరింపఁ గలవె
ఇతఁడు స్ఫులింగాక్షు డితఁడు రణఘ్ను
డితఁడు కాలాంతకుఁ డితఁ డురునేమి
వీరల తేజంబు విక్రమం బసుర
వీరులయెడ నింత విశదమై తోఁచు
వీరె నేఁ గాఁగ భావింపవే కరుణ
సారతేజస్ఫూర్తి ! సర్వజ్ఞమూర్తి !540
అనుచు కైదువులరాయఁడు విన్నవింప
విని కటాక్షించి శ్రీ వేంకటేశ్వరుఁడు
చెంత శ్రీ దేవి నీక్షింప నద్దేవి
యంతనే మణికంకణాంగదమకుట
హారంబులును కాంచనాంబరంబులును
హారమంజీరముల్ హెచ్చుతాళీలు
వారి కందఱికిని వరుస చొప్పునను
బారితోషికములు బహుమతి నొసఁగె