పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

శ్రీనివాసవిలాససేవధి


యని బరాబరి చేయ నాచక్రరాజు
వనజాక్షు నడుగుల వ్రాలి కేల్మోడ్చి
వినయంబుతో మ్రోల వినతుఁడై నిల్చి
తనసైనికులఁ జూపి తగ నిట్టు లనియె

చక్రరాజు తనసేవకుల పరాక్రమమును స్వామికిఁ దెలుపుట.


చతురాస్యపంచాస్యషణ్ముఖసేవ్య
సతతయోగీశ్వరస్వాంతానుభావ్య !
ఇతఁడె జ్వాలాముఖుం డీశ్వర ! చూడు
మతిపరాక్రమశాలి యగు వీరదస్యు
నొక్కపెట్టునఁ ద్రుంచి యుగ్రదానవుల
చక్కాడె నీతని సైన్యంబు గణితి 510.
మదకరు లైదువేల్ మావులు లక్ష
పదివేలు రథములు భటు లొక్కకోటి
మొనఁ దారసించుచో ముందుంచు నడుగు
వెనుక తియ్యనియట్టి వీరశేఖరులు
కెలన వీఁడిదె జ్వాలకేశుఁ డేవురినిఁ!
గలన దైత్యులఁ గూల్చె ఘడియలో వీని
దళమెంచ మత్తవేదండముల్ వేయి
వెలయుహారుల్ పదివేలు రథంబు
లైదువేల్ భటులు లక్షాయుతం బయ్యె
మాదండ వీఁడెగా మాసటీ డాజి520.
దుర్వారవిక్రమదోర్బలుఁ డరుల
గర్వం బణచువాఁడు గణుతింప సేన
ప్రోవైన యొకలక్ష పుండరీకాక్ష !
యావంక నదె బడబానలాఖ్యుండు