పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

153


భోరున నెరయ తుంబురుకోనదాఁటి
వచ్చినాఁ డిటు శలవా సామి యనుచు
హెచ్చరింపుచునుండు నీలోనె చండుఁ480.
డతిరయంబున వచ్చి యందందు నుతులు
నతులు సేయుచును నెంతయు నమ్రుఁడగుచు
బెత్తమూనుక నిల్చి బెట్టుగా దేవ !
చిత్తజజనక! లక్ష్మీప్రాణనాథ !
జగదాశ్రయాధారజఠర ! పరాకు
జగదీశ్వర! పరాకు స్వామి మేల్ బంటు

చక్రరాజు రాకను జయవిజయులు స్వామికెఱింగించుట.


చక్రరాజాధిరాజప్రభుం డితఁడు
విక్రమంబున లోకవిజయంబుఁ జెంది
ప్రతిహారమహి సమీపమున నేగిడిని
పతియాజ్ఞ యిఁక నంచు పలుకు నాలోన490.
జయవిజయులు దండఁ జని కేలు మోడ్చి
జయజయ విజ యాజిజయద పరాకు
జయ కమలాలయాజాని పరాకు
జయ కమలజ కామజనక పరాకు
జయ గర్భధృతజగజ్జాత పరాకు
జయ భక్తజనపారిజాత ! పరాకు
స్వామి యిం దిదె సుదర్శనచక్రవర్తిఁ
బ్రేమఁ గటాక్షించు శ్రీ కరాలోక
దేవ ! యీ యస్త్రరాజేశ్వరుఁ డిదిగొ
సేవ సల్పెడిని వీక్షింపు మబ్జాక్ష500.