పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

శ్రీనివాసవిలాససేవధి


లెచ్చిన తెమ్మెర లింపుగా విసర
గంధర్వభామినుల్ గానంబు సేయ
బంధురమాగధప్రకరంబు వొగడ
మణిమయం బైన విమానంబు నెక్కి
మృణిమీరు చామరల్ కెలన శోభిల్ల

{{Center|దిగ్విజయముచేసి చక్రరాజు వేంకటాద్రికి వచ్చుట.}

మగుడి యాక్షణమె శ్రీ మద్వేంకటాద్రి
తగనధిరోహించి దాపున రాఁగఁ460
బక్షీంద్రుఁ డా చక్రపతి రాకమున్నె
లక్షించి వడిఁజేరి లక్ష్మీసహాయు
ప్రణుతించి దేవ ! పరాకు హెచ్చరికె
రణమున మన చక్రరాజసింహంబు
విక్రమం బొప్ప దిగ్విజయంబు చేసి
యా క్రూరదైత్యుల యాతుధానులను
దేవర సెలవిచ్చు తీరునఁ ద్రుంచి
ఠీవి బిరుదులు బట్టించుక వచ్చు
చున్నాఁ డనుచుఁ దెల్పుచుండంగ నపుడె
పన్నుగా నాక్షేత్రపాలుఁ డుర్వడిగ470.
నురుకుచు దూరాన నుండియు భక్తి
సిరమున సంజలి చెలఁగ ధరించి
ధరణి జాగిలి మ్రొక్కి తగ్గి వాతెరకు
కరము చాటుగఁ బూన్చి కరుణాపయోధి!
దేవదేవ ! పరాకు దేవరవారి
సేవకుఁ డగునట్టి శ్రీ చక్రరాజు
భేరిసహస్రగంభీరనాదంబు