పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

157


నొకఁ డొకఁడే చాలు నురుబడబాగ్ని
నొక కబళంబుగా నూటుకొనంగ
నట్టి దైత్యుల నతం డవలీల గాగఁ
గొట్టి రణంబునఁ గూల్చెనుగాక
తరమె యన్యులకు నిద్దర వారిఁ జేరి
దురమున నెదిరించి తొడరంగనైన

దేవతలు లంకాధినాధుని దునిమి రక్షింపుమని వేడుట.



ఇంక నిం దొక్కరుఁ డింతటివాడు
లంకాధినాధుండు లావున వానిఁ580
దునిమి రక్షింపవే తోయజనేత్ర !
యనిన వారికి వేంకటాధీశుఁ డనియె
వినుఁడు దేవతలార ! వెస దశగ్రీవు
నని నేనె ద్రుంచెద నద్భుతలీల
నటు గాన సుఖముగా నలుకక మీరు
పుటభేదనంబుల భోగింపుఁ డింకఁ
జనుఁడు మీ మీ నివాసములకు వడి
ననుటయుఁ జతురాస్యుఁ డా శ్రీనివాసు
వినుతించి సేవించి విసయ ముప్పొంగ

బ్రహ్మ శ్రీనివాసున కుత్సవముసేయ ననుజ్ఞవేఁడుట.



ననుపమభక్తి నిట్లని విన్నవించె590.
శ్రీ వేంకటావాస! శ్రీ శ్రీనివాస!
భావహారాకార! భక్తమందార!
దేవర నొకటి ప్రార్థించెద నిపుడు
నా విన్నపమువిని నన్ను మన్నించు