పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

శ్రీనివాసవిలాససేవధి


భుజదండములు రెండు పొడవుగా సాచి
నిజదృష్టి రవియందె నిల్పి కన్ రెప్ప
వేయక శ్వాసంబు వెడలనీ కడచి
రేయును బగలు నిద్రించ కాహార
మేమియుఁ గొనక యట్టిటు చలింపకయె
హామిక నిల్చి పంచాగ్నిమధ్యమున360.
గండకత్తెరఁ బూన్చి కంఠనాళమున
మండలాగ్రములు మర్మములఁ గీలించి
భూతంబులు దలంక భూరివృక్షములు
ధాతను గురియించి తపము సల్పంగ
వారిజభవుఁ డేగి వాని నీక్షించి
ఘోరతపం బేమిగోరి చేసెదవు
వేఁడు కోరిన దిత్తు వేగమే యనిన
వాఁడు నాయుధముల వరశిలాధార
గరళంబులను దేవగంధర్వదనుజ
గరుడమనుష్యరాక్షసయక్షజనుల370.
వలన వధ్యుఁడుగాక వలయురూపమునఁ
జెలఁగునట్టుగ దయచేయవే యనుడు
వనజసంభవుఁ డట్టివరముల నొసఁగి
కనరాక భయమునఁ గదలె నక్షణమె
ఆ దైత్యుఁ డత్తరి నఖిలలోకముల
సాధు లౌ మౌనుల సకల దేవతలఁ
జాల బాధింపుచు జనపదనగర
జాలముల్ చెరుపుచు శకకిరాతాంగ