పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

149


యవనులు మొదలగు నతిపాపజనులు
భువిఁ దనుగొలువ నెప్పుడునుండు నాతఁ380.
డీ సుదర్శనురాక కెంతయుఁ గనలి
యీసునఁ దనసేన నెదురుగాఁ బనిచె
బనిిచిన నాసేన పాథోధిచయము
పెనుపొంది యుబికి యాభీలతరంగ
రంగత్తిమింగలరాజితో వచ్చు
సంగతి కంఖాణసంఘమాతంగ
భరముతో నడరిన ప్రళయకాలోగ్ర
తరబాడబాగ్ని బృందంబు చందమున
ధగధగమెఱయు నస్త్రప్రకాండములు
ధిగధిగజ్వాలలై దీపించ మించి390.
హరిచక్రరాజసైన్యంబు తేజమునఁ
బరవాహినుల గ్రాచి బల్మి నింకించ
కోలాహలంబుగా ఘూర్ణిల్లి తెరలి
యాలంబునం దుభయదళంబు లొరసి
పోరఁగను కబంధములు నటియించె
వారణంబులు డుర్లె వాజులు ద్రెళ్లె
నటు తేర్లు చదిసె రథ్యంబులు చిదిసె
భటతతి మిడిసె సుపర్వాళి జడిసె
అప్పుడు దైత్యసంహతి తన సేన
నొప్పించి నంతఁ గన్గొని చాల కడగి400.
యని చక్రవిభుఁడుు క్రోధాగ్ని హుంకార
ముస వెడలింప నద్భుతముగా నదియ
తరలి పావకసంజ్ఞఁ దగఁ జిక్కుపఱచు