పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

147


దండించి వాని వేదండంబు గూల్చి
ఖండించె నట్టి రక్కసుశిరం బవని
అంతటను సుదర్శనాధిపుఁ డటులం
బంతంబున సురారిఁ బరిమార్చి జగతి
నిహతకంటకఁ జేసి నిజతేజమునను
మిహిరుకైవడి మించి మిగుల నాదేశ
జనములఁబాలింప జనపాలునొకని

చక్రరాజు నుత్తర దిగ్విజయము



యునిచి వాహినితోడ నుత్తరదిశకు340
గదలి వేగిరమె యక్కడ నొక్కయెడను
కదళీక్షువనముల కరమొప్పు ధరణి
నిలిచి సురారాతినేతను వెదుక
బలములఁ బంపించి పటహభాాంకృతులు
భోనభోంతరముల బోరున నెగడ
నానోగ్రభటసింహనాదముల్ రిపుల
గుండియల్ వ్రేలించఁ గుంభిని నిండి
దండిగాఁ దనసేన దనరంగనుండె

శివునివలన వరములఁ బడసిన భేరుండను రక్కసుఁడు



ఆచోట భేరుండుఁ డను దానవుండు
ఖేచరాజు [1]సుతుండు గిరిసమానుండు350
యోజనత్రితయసమున్నతగాత్రుఁ
డాజి మత్తేభసహస్రబలుండు
మున్ను శ్రీశైలాగ్రమున నుగ్రనిష్ఠ
సన్నంపుసూది చరణాగ్ర మూని

  1. "ఖేచరాజ్యసుతుండు" వ్రా. ప్ర. పాఠము.