పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

శ్రీనివాసవిలాససేవధి


వీరసేనాపతుల్ వేగ నాయిత్తు
మీరి రాఁబంచి గంభీరదుందుభులు
తాడించుఁడని వేత్రధారులఁ బలికి
వీడనికినుకతో వేగరి నొకని
పరసేనలతెఱంగు బరికించఁ బనిచి
పురము వెల్వడి దుర్గభూమికై నడచె
నంతలోన సుదర్శనాధిపసైన్య
మంతటంతటఁ జేరి యార్చి రక్కసుల
నఱికి యచ్చటి తోరణంబులఁ బెరికి
విఱిచి డాలులు కోట వెసఁ గూలఁజెఱచి270
వ్రాల్చి తేరుల హయవారముల్ గూల్చి
గ్రాల్చి పురము లందు కరిఘటల్ వ్రేల్చి
ముంచి తూపుల ఖడ్గముల తలల్ ద్రుంచి
దంచిభటుల మత్తదైత్యుల నొంచి
తరిమి సేనల నడిదమ్ముల మెరిమి
యురిమినట్టుల నార్చి యుబికి పైఁదార్చె
అటుల నార్చినఁ జూచి యా రాక్షసుండు
నిటలాక్షుఁ డిచ్చిననిష్ఠురవరము
బడయుటను మదించి భయ మింత లేక
వెడలి రథతురంగవేదండఘటలు280
సుభటసంఘము నిండి చుట్టుల నడర
రభసంబునను సింధురమ్ముపై నెక్కి
సవరణ గాజిరా సంధించి మేన
వివిధాస్త్రశస్త్రముల్ వేగ ధరించి