పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వా స ము.

143



మొత్తి దైత్యులశిరంబుల డుర్లగొట్టి
యేవురు నసురుల నేవురుఁ దొలఁగి
పోవనీయక పొలియించి రపుడు240.
ఇటుల వైరులఁ ద్రుంచి యేవురుచక్ర
భటు లేలికకు మ్రొక్కి భక్తితో నిలువ
గనుఁగొని వారిఁజక్రప్రభుం డెలమి
వినుతించి యచ్చటి వివిధలోకులను
పిలుపించి యభయంబు ప్రియమున నొసఁగి
బలియు నొక్కని మహీపతిగా ఘటించి
మునివరుల్ దీవింప ముదమునఁ దరలి
చని పశ్చిమంబున జయభేరు లులియ

చక్రరాజు పశ్చిమ దిగ్విజయము.


మునుకొని సేన లిమ్ముల సాగి నడువ
వనములు గిరులు గహ్వరములు నడరి250.
చతురంగబలములు సందడింపంగ
ప్రతిలేక చక్రభూపతి వచ్చుతఱిని
అచట కానకకర్త యను రక్కసుండు
సుచిరతపశ్శక్తి శూలిచే వరముఁ
జెంది యింద్రాదులఁ జెనకుచు మునుల
నెందు బాధింపుచు నెసఁగు రక్కసుఁడు
వాఁ డట్టి పటహానిధ్వానంబు చెవుల
వాడిమి వినినంత వడి పెట్టుబడిన
యురగంబుకైవడి యూర్చి కోపించి
యరదంబులు గజంబు లశ్వముల్ భటులు260.