పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

శ్రీనివాసవిలాససేవధి


అంపవానల ముంచి యద్రులార్భటులఁ
గంపింప చెలరేగి కదనంబు సల్ప
సత్తఱి దైత్యు లాహళహళిఁ గలఁగి
ఉత్తలపాటుతో నుఱుకంగ గడఁగి
అంకవంకపుళిందు లనుదైత్యవరులు
పంకజభవుఁ డిచ్చు బహుళోగ్రవరము
లందుట గర్వించి యందు బిడాలు
ముందుగ రావించి మూర్ఖుబాలకుని220.
హెచ్చరింపుచు వార లేవురు సేన
విచ్చి పోవఁగనీక వెసఁ బురిగొల్పి
పరిఘతోమరగదాప్రాసాసిపరశు
వరచాపశార్ఙాది శస్త్రముల్ బూని
యరదంబు లెక్కి గజాశ్వరధాళి
యిరువంక బారులై యిల సందడింప
వేరువేరుగ మొనల్ విభజించికోనుచు
చేరి జ్వాలాముఖసేనలఁ గొట్టి
గోరించి చెండిన ఘూర్ణిల్ల విఱిగి
తారిన తనసైన్యతతి నాదరించి230.
యా సుదర్శనుఁడు నేత్రాంచలదృష్టి
నీసునఁ గోపాగ్ని యెగయ వీక్షించె
నా లోచనాగ్నియం దాక్షణంబుననె
జ్వాలకేశుఁడు మహాసటుఁడు రణఘ్నుఁ
డల స్ఫులింగాక్షకాలాంతకు లనెడి
బలవంతు లేవురు ప్రభవించి వెడలి
కత్తులు కేడెముల్ కరములఁ దాల్చి