పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వా స ము.

145


యుద్ధవర్ణనము.


బెట్టుగా సంగ్రామభేరి వేయించి
యట్టిమొనం దాఁకఁగా నిరుదళము
లంటి సంకులకలహంబునఁ గినిసి
యొంటరి యొంటరి యోధయు యోధ
రథమును రథము సారథిని సారథియు
రథికుండు రథికుండు రౌతును రౌతు290
తురగంబు తురగంబు దొరయును దొరయు
కరియును కరియు గింకరుఁడు గింకరుఁడు
నొండొంటి కైదువు లొరయుచు మెఱయ
మెండుభండన మంట మింట నచ్చరులు
తనవల్లభుఁడు వీఁడు తనవిటు డితఁడు
తననాయకుఁడు వీడు తనపతి యితఁడు
తన భుజంగుఁడు వీఁడు తన విభు డితఁడు
తనపల్లవుఁడు వీఁడు తన ప్రియుఁ డితఁడు
తనరమణుఁడు వీఁడు తన కాంతుఁ డితఁడు
ననుచుఁ గోర్కొనుచు న య్యని జూచుచుండ300
కత్తి నొక్కఁడు కచాకచి వైరిశిరము
మొత్తి డొల్లించు నా మొండెంబు తనదు
చేతివాలున వాని శిరము ఖండించు
చాతురి నొకఁ డీటె సరిగట్టె బడఁగఁ
బగతురఁ బొడుచు నొపగర యయ్యీటె
తెగ డుస్సీపో నెక్కి తెగటార్చు నతని
నొకఁ డర్థచంద్రబాణోద్ధతి నహితు
వికలమస్తకుఁ జేయ వెస నట్ల వాని