పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వా స ము.

139


పురివిచ్చి వీగియు పొలసి రూపరియు
తనదుసైనికు లెల్ల తలఁగఁగఁ జూచి
కినుక రక్కసుఁ డొక్కగిరిశృంగ మతని
తేరుకై వైచిన దృఢశక్తి దాని
వారించి మించి యా జ్వాలాముఖుండు
ఘోరవిక్రమము గైకొని తనహేతి
చే రాక్షసేంద్రుని శిరము ఖండించె
అప్పుడు మింటిపై యమరదుందుభుల
చప్పుడు నెగడఁ బుష్పంబులవాన150.
గురిసె ఖేచరతతి కొండాడి పొగడె
ధరణీసురాదు లౌ తద్దేశజనులు
సంతసించిరి సుదర్శనరాజవరుని
అంతట నా విభుం డాదేశమునకు
బరిపాలనమొనర్పఁ బటుబుద్ధి నొకని
ధరణీశుఁ గావించి తరలి యాక్షణమె
కడగి యాగ్నేయదిక్తటమున కరిగి

ఆగ్నేయదిక్కున మాయాక్షుఁడను దానపుని సంహరించుట.


తొడిబడ విజయదుందుభులు మ్రోయించె
అక్కడ మాయాక్షుఁ డను దానవుండు
పెక్కండ్రు దైత్యులు పెంపునఁ గొల్వ 160.
క్షత్రియాకృతిఁ బూని సకలలోకులకు
విత్రాసమొసఁగ గర్వించి గ్రామములు
ననుపమమఠములు నగ్రహారములు
జనపదంబులు మౌనిజనుల యాశ్రమము