పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

శ్రీనివాసవిలాససేవధి


వానిముందర దానవస్తోమ మడరి
పూని పచారించి పొదలు రోసమున
మండలాగ్రముల తోమరముల గదల
భిండివాలంబుల బెట్టుగాఁ గొట్టి120.
తలలు డుల్లఁగ బహుదండముల్ దునియ
బలు మొండెములు ద్రెళ్ల పదములు చిదియ
కరములు తునియ వక్షంబులు నలియ
కరులు నెగ్గగ తురంగంబులు మ్రగ్గ
రథములు చెదర వీరభటాళి బెదర
రథికులు నుదర సారథులు బెట్టదర
సిడములు నెఱఁగ చేసింగిణిల్ విఱుగ
నడిదముల్ తునుగ నస్త్రాస్త్రముల్ బెనఁగ
నతిఘోరరణమున నాత్మసైన్యంబు
ప్రతిరుద్ధ మగుట చక్రప్రభుం డరిగి130.
జ్వాలాముఖుని బంప వడి నాతఁ డట్టి
యాలంబు జొక్కి చెక్కాడె వైరులను
అచ్చట చండజంఝానిలంబునకు
విచ్చిపోయెడు మేఘవితతిచందమునఁ
గడకమై తూరు సింగంబు ఢాకకును
కడుభీతి నుఱుకు మృగంబులపగిది
వడి బెల్లడరు సాళువంబును గాంచి
పడి మూర్ఛఁజెందెడి బకములమాడ్కి
కడిది చుట్టుకవచ్చు కార్చిచ్చుశిఖల
నడుగంట మాడు కారాకులకరణి140.
దురమున నాతని దోర్విక్రమమున