పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వా స ము.

137


ఝళిపించి యట్టహాసములు సేయుచును
మొనలకుఁ జేరి యా మూఁకపై దూరి
కినుకఁ బంతము మీఱి కినిసి తాకినను
చల మొప్పఁగా సుదర్శనరాజు సేన
లలర వైరిబలంబు లాక్రమించుకొని
చక్కుచక్కునఁ జెక్కి సమితి బల్ డొక్క
లక్కులు పిక్కలు నల కాళ్లు వేళ్లు
సిరములు కరములు చెక్కులు ముక్కు
లురవడి తునియలై యుర్విపైఁ బర్వ100.
జొత్తుల యేరు లెచ్చోటుల నెగడ
హత్తుల మొత్తంబు లత్తఱిఁ గూలఁ
దుత్తుమురై రథతురగముల్ మ్రగ్గఁ
దత్తరంబున దైత్యతతులు నూటాడ
కోలాహలంబుగా ఘోరవైఖరుల
నాలంబు సల్పి రత్యద్భుతంబుగను
అట్టి కయ్యంబున హతశేషులైన
కట్టడిరక్కసుల్ కడువడి నురికి
మన బలంబుల నెల్ల మ్రగ్గించి పరగ
నినుమడించిన కిన్క హెచ్చి వచ్చి రని110.
వీరదస్యునిచెంత వివరింప నతఁడు
ఘోరాగ్రహంబున ఘూర్ణిల్ల గ్రుడ్లు
వేఁడి వేఁడిగఁ గూర్చి వెస నౌడుగఱచి
వాఁడికోరలు దీడి వాలు చేఁబూని
తనచుట్టములు తాను తాఁకి బె ట్టార్చి
యని సుదర్శనసైన్య మంతయుఁ గలచ