పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

శ్రీనివాసవిలాససేవధి


జను దెంచుటను మాకు శంక యయ్యెడిని
యన విని రక్కసుఁ డత్యాగ్రహంబు
నెగడంగఁ గన్గవ నిప్పుకల్ గురియ
భుగభుగ నూర్పులఁ బొగలు బె ట్టెగయఁ 70
జెంత నమ్మంత్రుల జీరి క్రూరోక్తి
నెంతయు గర్జిల్లి యిట్లని పలికె
వినుఁ డిందు మనుజుండు వెర పింత లేక
చనుదేరఁగలఁడె యా శతమఖప్రముఖు
లెవరొ వచ్చిరి వీరి నీక్షణంబుననె
భువిఁ గూల మొత్తి బెబ్బులి మృగంబులను
బొదివి కోరలఁ జీల్చి భూరిరక్తములు
మెదడు గ్రోలెడుమాడ్కి మిక్కిలి డొక్క
లుక్కున వ్రక్కలిం చుష్ణాస్రధార
లక్కజంబుగఁ ద్రావి యార్చెద నిపుడె80
తే రాయితము చేసి తెప్పించు డెల్ల
వీరసైనికులను వెడలించు డనికి
ననుడు మంత్రులు వేగ నఖిలసైనికుల
మునుగూర్చి వేసడంబులు బూన్చి రథము
బేర్పించి సన్నాహభేరి వేయించి
యేర్పరించి బలంబు నెదుట ము న్బనిచి
దుర్గస్థలంబులఁ దొలఁగక నాప్త
వర్గంబు నిల్పి య వ్వార్తలు విభుని
కెరుగింప నతఁడు తే రెక్కి సారథిని
త్వరసేయుచుఁ గడంగి తరలంగ భటులు90
ధళధళుక్కున నాయుధమ్ములు మెఱయ