పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వా స ము.

135


శరచాపతోమరాస్త్రంబులు బూని
సందడింపఁగ రథసామజతురగ
బృందంబులును నిండి బెట్టుగా నడర
భేరినిస్సాణగంభీరఢక్కాది
భూరివాద్యంబులు భోరున మొరయ
దిక్కు లాకసము ప్రతిధ్వను లీనఁ
బిక్కటిల్లుచు లోకభీకరంబుగను50.
చండాంశుమండలసదృశ మౌ రథము
నిండువైఖరి నెక్కి నిష్ఠురోద్ధతుల
సన్నద్ధుఁడై యుద్ధసాహసబుద్ధి
మున్నుగాఁ బూర్వదిఙ్ముఖమున వెడలె

చక్రుండు తూర్పుదిక్కున రక్కసులఁ జెండాడుట.


వెడలినచక్రుండు వీరదశ్యునకుఁ
గడుసురక్కసున కా గహనగోచరులు
వినుము రాక్షసముఖ్య వింతకార్యంబు
జనియించె నద్భుతసన్నాహ మెసఁగ
జనపాలుఁ డెవ్వఁడో చతురంగబలము
దలరంగ నివ్వనాంతరమునఁ జొచ్చి60.
వచ్చెను వేటాడవలసియో మోస
మెచ్చి మనలమీఁది కేతెంచువిధమొ
తెలియఁజెప్పుడు నిందు తేరిజూడంగ
బలవైరి మొదలుగా భయపడుచుండు
నిదియేమొ యుత్పాత మిట నిర్భయముగ
కదిసి భేరి మృదంగ కాహళుల్ మొరయఁ