పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

శ్రీనివాసవిలాససేవధి


లుటజముల్ చెఱిచి బహూపద్రవంబు
లటు చేయుచుండువాఁ డా భేరిరవము
విని యాగ్రహించి నావిపినంబునందు
మనమున జడియ కే మహిపాలుఁ డిట్లు
మదమున వచ్చె నా మాయచే వాని
చదిచి డమాము లశ్వములు నేనుంగు
లన్నియు హరియించి యరుదెంతు నంచు
సన్నద్ధుఁడై బంధుసంఘంబుతోడ
ననికిఁ జేరఁగ వాని నస్త్రశస్త్రముల
నినిచి తూలించె నా నృపసైన్య మపుడు
ఆరీతి ప్రహారంబు లంటిన నట్టి
క్రూరదానవుల మార్కొనలేక తూలి
మాయచేఁ దమయున్కి మరుపెట్టి డాగి
పోయిన నవ్వనభూమి యంతయును
వెతకి గానక వారి విడిదిపట్లెల్ల
నిరోషమునఁ జిచ్చు లంటించి మరలి
సైన్యపతికిఁ దెల్ప చాల నతండు
వన్యాంతరము లంటి వరుస శోధించి
మాయ సేసినవారి మాయఁజేయంగ
పాయని కిన్కను బాణంబు బూని
మరియు నాగ్నేయాస్త్ర మహిమ యం దుంచి
వరభుజాశక్తి నుర్వడిఁ బ్రయోగించె
నంతట నా పావకాస్త్రంబు మంట
లెంతయు నెగయంగ లేచి యావనము