పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యజ్ఞానమునఁ బ్రమత్తాలస్యముననైన
          ధవళాంధుకోటీరుఁ దలఁచిరేని
మృడునకునై యష్టమీచతుర్దశులందు
          నుపవాసముండంగ నోపిరేని
షట్కాలములయందు సర్వలోకేశ్వరు
          శ్రీమహాదేవుఁ బూజించిరేని


గీ.

వారు మాన్యులు పార్వతీవల్లభునకు
వారె వంద్యులు మముఁబోఁటివారికెల్ల
నట్టివారల మన్నింపరైతిరేని
ద్రోహమగు మీకు నాకు నద్రోహులార.

52


క.

శివునెడ భక్తియు నెప్పుడు
శివభక్తుల జూచినపుడు శివుఁడను తలఁపున్
శివశివ కలిగినవారల
[1]శివసాదృశ్యులను మీరు చేరకుఁ డెపుడున్.

53


క.

అలవోకయుఁ గలలోనను
మలహరుభక్తులను నీశు మన్నించినవా-
రల (భక్తవరుల) శైవులఁ
దలఁపకుఁడీ దూతలార దండింపంగన్.

54


ఆ.

పాపకర్మునైన భాగ్యహీనునినైనఁ
బట్టిచూడ మీకుఁ బాడిగాదు
శైవవరులఁ జేరి సేవించువారలు
పురహరుండ కాఁగ బుద్ధి గనుఁడు.

55


ఆ.

జంతుకోటిలోన శంకరపాదాబ్జ-
సేవ సేయువారిఁ [2]జేర కెపుడు
దూరమందుఁ దొలఁగి దూషింప కెంతయు
భక్తి గొలువవలయు [3]భటులు మీరు.

56


క.

ప్రాసాదము నిర్మాల్యము
వాసితొ పాదోదకంబు వైభవ మలరున్
[4]డాసినఁ గైకొనువారలఁ
దా సేవింపంగవలయుఁ దథ్యము సుండీ.

57


వ.

అని కృతాంతుఁడు తామసాధ్వానంబు(?) నౌలుంబరాదులకుఁ జెప్పి యీ ప్రకారంబులయందు ఘంటాధ్వానంబులతో సర్వజంతువిజ్ఞాపనంబుగాఁ జాటుండని యంతర్ధానంబు గావించె. దూతలు నట్లు కావించిరి. ఈ ప్రకారంబున శౌనకాదులకు రోమహర్షణమునిప్రవరసుతుండు సూతుండు చెప్పెనంత.

58


శా.

రామామన్మథ భోజరాజకవితారమ్యప్రభావో(న్న)తా
సామాగానవిశేషశాస్త్రకలనా సంభావ్యసారోదయా

  1. తా. శివసాదృశ్యులురు
  2. తా. జేయ
  3. తా. భటుల
  4. తా. దాసిన