పుట:భాస్కరరామాయణము.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు కాంచి వడి దాఁటి యక్కాంచనశింశుపావృక్షాధిరోహణంబు సేసి నలుదె
సలు పరికించి కనత్కనకకమలకువలయకలితజలజాకరంబులును సకలర్తుసమయ
సముదితఫలదళకుసుమలసితారుణసితాసితహరితతరునికరంబులు నుదయరాగసం
కాశపుష్పితాశోకకింశుకషండంబులుం గల్పకసంతానపారిజాతాదినిఖిలవృక్షం
బులుం గలిగి నందనచైత్రరథంబుల కెన యనం దగి నానాప్రసూనరత్నరత్నా
కరం బగుచు బహుగంధబంధురం బగురెండవగంధమాదనం బన నెఱయ మెఱ
యుచున్న యశోకవనమధ్యంబున వివిధప్రాకారసౌధావృతంబును భద్రవిద్రుమ
సోపానభాసమానంబును దప్తజాంబూనదసముదితవేదికావిరాజితంబును ననేక
మణిమయభాసురాసనగృహాలంకృతంబును శాతకుంభస్తంభసహస్రశోభితంబును
నగుచైత్యప్రాసాదంబు గని వెఱఁగందుచు నయనానందకరలసదిందిరమంది
రంబున.

139

హనుమంతుఁడు సీతం గాంచి దుఃఖించుట

తే.

బాలచంద్రనూతనరేఖకపగిది డస్సి, పంకదిగ్ధమృణాళికకభంగి మాసి
వాన లేనివల్లికగతి మేను వాడి, నిగుడు చింతాపరంపర నిండ నలమి.

140


సీ.

కెంగేలు చెక్కునఁ గీలించి యందంద, కనుఁగొనలను బాష్పకణము లొలుక
వెండ్రుకల్ జడగట్టి వేఁడినిట్టూర్పుతో, విన్న నై వదనంబు వెల్లఁ బాఱ
[1]నుపనాసములఁ గ్రుస్సి విపులపీడల వాడి, యురుపంకమున బ్రుంగి యొడలు నలఁగ
దిక్కెవ్వరును లేక దీనతఁ గడుఁ దూలి, వలవంతలోఁ దాఱి 3 వగలఁ బొగిలి
యుగ్రకోపతర్జనముల నుల్ల మవియ, ఘనభయంకరాకారరాక్షసులనడుమఁ
బరుషతరవృకావృత యైనహరిణికరణి, భయముఁ [2]బొంది యలంతమైఁ బరఁగుదాని.

141


వ.

మఱియును.

142


మ.

అతినిందాన్వితకీర్తికైవడి విహీనార్థోక్తిచందంబునం
దతధూమావృతవహ్నిసంగతిని నబ్దచ్ఛన్నచంద్రప్రభా
కృతిఁ బంకావిలగంగభంగి శిశిరక్లిష్టాబ్జినీరీతి మృ
ద్గతమాణిక్యశలాకమాడ్కి మలినాంగచ్చాయతోఁ దూలుచున్.

143


ఆ.

చందురుండు లేనిశర్వరిగతిఁ జక్ర, వాకవిరహచక్రవాకికరణి
దినకరుండు లేనిదినలక్ష్మికైవడి, నొప్పు దూలి యొంటి యున్నదాని.

144


మ.

గళదశ్రూదకసిక్తవక్త్రఁ గుటిలక్రవ్యాదసంతర్జనా
కులచిత్తన్ విరహాగ్నితప్తఁ గృపణం గ్రూరవ్యధాసంశ్రితన్

  1. ఉపవాసముల వాడి యురుపంకమున బ్రుంగి, యొలయిక నంతయు నొడలు డస్సి
  2. బొందినమృగశాబనయనఁ గనియె.