పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశోద్ధరణ ప్రయత్నములు

295


మందుతోటల యజమానులు వ్యాజ్యములలో ఓడిపోయి, ఈయనపైనకక్షవహించి నష్టముకొరకు మరలవ్యాజ్యములు వేసిరి. 1869 లో ఈయన చనిపోయిన పిదప ఇతని ఆస్తినిఅమ్మించి సొమ్ముపుచ్చుకొనిరి. ఈ మహానుభావు డిట్లు తన సర్వస్వమును దేశమున కర్పించి ధన్యుడైనాడు.

ఆనాడు భారతదేశోద్ధరణకు పాటుపడిన వారిలో డాక్టర్ రాజేంద్రలాల్ మిత్రా గారింకొకరు. ఈయన 1824 లో జన్మించి విద్యాభ్యాసముజేసి గ్రీకు ల్యాటిను జర్మను మొదలగు పాశ్చాత్యభాషలందు మహా పండితుడై చరిత్ర పరిశోధనలుచేసి గొప్ప గ్రంథరచనను చేసెను. ఈయనగూడ నీలిమందుతోటల యజమానులకు వ్యతిరేకముగా రైతుల పక్షమున పనిచేసెను.

IV

ఇట్లు వంగరాష్ట్రమున నానాడు గొప్పవిద్యావంతులు సంస్కర్తలు బయలుదేరి దేశోద్ధరణకొరకు పాటుపడసాగిరి. ఆనాటి కంపెనీ పరిపాలనలో దొరల దుండగములను అరికట్టి దేశప్రజల హక్కులను సంరక్షించుటకొక ప్రజాసంఘముండుట యవసరమని తోచెను. అంతట దేశభక్తులగు మహానుభావు లందరు కలసి, 1851 లో 'బ్రిటిష్ యిండియ౯ అసోసియేష౯' అను సంఘమును స్థాపించి దేశముయొక్క రాజకీయ ఆర్థిక సాంఘికాభివృద్ధికొరకు పాటుపడసాగిరి. దీనిని స్థాపించిన వారిలో హరిశ్చంద్రముఖర్జీ, రాజేంద్రలాల్ మిత్ర, ప్రసన్నకుమార ఠాగూరు, రామగోపాలఘోషు, దిగంబర్ మిత్ర, ప్యారీచందు