పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


మిత్ర మున్నగువారు సుప్రసిద్ధులు. ఈసంఘమువారు సభలు చేయించుచు ప్రజలబాధలు వర్ణించుచు నింగ్లాండుకు మహజరులంపసాగిరి. తరువాత ఈసభకు క్రిస్టోదాస్‌పాలు సహాయకార్యదర్శియై విశేషకృషి చేసెను.

క్రిస్టోదాస్‌పాల్ 1831లో జన్మించెను. ఇతడు ఇంగ్లీషు చదివి పత్రికావిలేఖరియై దేశసేవ చేయసాగెను. 1857లో నొక మాసపత్రికను స్థాపించెనుగాని యది కొద్దిరోజులలోనే యంతరించెను. ఇతడు హరిశ్చంద ముఖర్జీగారి స్నేహమునకు పాత్రుడై హిందూ పేట్రియటుకు విలేఖరియై ఆయన 1869 లో మరణింపగా తానే దాని కధిపతియై దేశముకొరకు గొప్ప పనిచేసెను. ఇతని విమర్శనలు నిర్భయముగా నుండెను. 1868 లో నితడు మునిసిపలుసంఘసభ్యుడై 1872 లో వంగరాష్ట్ర శాసనసభ్యుడై తరువాత గవర్నరుజనరలు శాసనసభకు 1883 లో సభ్యుడుగా నియమింపబడెను. ఇతడు 1884 లో మరణించెను. హిందూపేట్రియటు పత్రికలో నితడు 1866 నాటికఱువును గూర్చి చేసిన విమర్శనలకు వంగరాష్ట్రగవర్నరు బహిరంగసభలో జవాబు చెప్పి ప్రజాభిప్రాయమును మన్నించుటను సూచించెను. 1874 లో నతని పత్రికను నాటిగవర్నరు కోపదృష్టితో చూచి కొన్నాళ్లు బహిష్కరించెను గాని తరువాత నతని ప్రతిభనుజూచి ప్రభుత్వముకూడ మెచ్చుకొనెను. ఈతనికి రావుబహదూరు, సి. ఐ. ఇ. బిరుదము లిచ్చిరి. ఈబిరుదములు తనకు రుచింపవనియు, తనకు ముందుగనే చెప్పినచో వీనికంగీకరించి యుండననియు నితడు తనపత్రికలోనే వ్రాసెను!