పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మపురాణము

ఉత్తరఖండము - సప్తమాశ్వాసము

ద్వితీయసంపుటము

క.

శ్రీ కేశవసచివానుజ!
లోకస్తుతసౌమ్యచరిత! లోకాలోక
వ్యాకీర్ణకీర్తిపూర! ద
యాకరనయనారవింద! యబ్బయకందా!

1


వ.

పరమయోగవిద్యాగరిష్ఠుండగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె.

2


అ.

అఖిలలోకరక్షణార్థమై [1]పెనుపొంది
హరి వరాహరూపమైన విధము
చిత్తగించి వినుము చెప్పెద నీ కని
శివుఁడు గిరిజతోనఁ జెప్పఁ దొడఁగె.

3

వరాహావతారకథ

క.

శ్రీవైకుంఠపురంబున
[2]దేవాధిపనుతుఁడు వాసుదేవుఁడు సతత
శ్రీవనితాసుఖకలితమ
హావిభవముతోడ [3]నుండు ననవరతంబున్.

4


క.

తద్ద్వారపాలు లఖిలజ
గద్వినుతులు పుణ్యదములు గరుడధ్వజపా
దద్విదయసేవనాత్ములు
సద్వర్తనపరులు నిత్యసౌమ్యచరిత్రుల్.

5
  1. పెనుపారి (మ)
  2. దేవాధిపుడైన (మ-తి-హై)
  3. నేలు (మ-తి)