పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

పద్మపురాణము


విష్ణుండు ప్రకృతియందుఁ బొందుటయు మహదాది సర్గ ప్రతిసర్గ
మహత్త్వంబును సకలభూతసంభవకథనంబును చతుర్వ్యూహ
మాహాత్మ్యంబును మత్స్యావతారంబును దుర్వాసుశాపంబున న
మ్మహాలక్ష్మి యణంగుటయును సముద్రమథనంబును గూర్మవిభ
వంబును లక్ష్మీసముద్భవంబును ద్వాదశీవ్రతమాహాత్మ్యంబును
బాషండకథనంబును త్రిగుణస్వరూప స్మృతిపురాణ [1]విశేషం
బును నన్నది షష్ఠాశ్వాసము.


  1. విశేషంబుల తెరం గెరింగించుటయు పద్దెనిమిది పురాణంబులు సంక్షేపంబుగా నెరిగించుటయు నన్నది (హై)