పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

పద్మపురాణము


వ.

ఇట్లు చెప్పి దేవా! దైత్యు లజేయులై సకలలోకంబులు సాధించిరి.
వారల గెలువ నెవ్వరికి నశక్యంబు. గావున నీవ యద్దానవులం
బరిమార్పవలయు నని విన్నవించిన హరి కరుణాయత్తచిత్తుండై
వారల నాదరించి దనుజు లెవ్వరికి నసాధ్యులని మనంబున నిశ్చ
యించి యీయర్థం బొరులచేతం గాదని నన్నుం దలంచిన
యా కషణంబ యచ్చటికిం జనినం గనుంగొని పద్మనాభుండు నా
కిట్లనియె.

162


ఉ.

సోమకళావతంస! సురసూదను [1]లెల్ల నధర్మమార్గులై
వేమఱు నిర్జరాదులకు [2]వేఁకర మొందఁ జరింపుచున్న వా
[3]రేమెయి నైన వారి భ్రమియించి యవిద్య భజించి యాత్మలన్
దామస మొందఁజేసి విదితంబుగ లోకము లుద్దరింపవే.

163


వ.

నీవు పాషండధర్మాచరణంబు నంగీకరించి వారి మోహాత్ములం
జేసి తామసపురాణ [4]శాస్త్రంబులు చేయింపుము. మద్భక్తివిర
హితులగు మునులు కణ్వాత్రిగౌతమశక్తిజైమిన్యుపమన్యు
కపిలదుర్వాసమృకండుబృహస్పతి[5]జమదగ్నులందు భవ
దీయశక్తి యావహించి [6]తత్ప్రభావంబునఁ దత్పురాణంబులు
తామసాఖ్యంబులై భవత్ప్రసాదంబున విస్తరిల్లి జగత్ప్రసిద్దంబు
లగు. నీవునుం గపాలచర్మభస్మాస్థిచిహ్నితుండవై పాశుపతా
స్త్రంబు గల్పించి మూఁడులోకమ్ముల మోహింపం జేయుము
కంకాళశైవపాషండమహాశైవాదిభేదంబులు గలిగి వేదబాహ్యం
బులగు మతంబులు తామసులగు విప్రు లవలంబించి భస్మధారులై

  1. లున్నతధర్మమార్గులై (మ-తి-హై)
  2. వేకట (హై)
  3. రేమియునై న (ము)
  4. శాస్త్రంబు లుపదేశింపుము వారలు భగవద్భక్తి విరహితు లగుదురు, మరియు కణ్వాత్రి (తి-హై)
  5. కౌశికమతంగజమదగ్నులందు (హై)
  6. తామసశాస్త్రంబులు చేయింపుము తత్ప్రభావంబున (హై)