పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

259


వ.

అనుటయు విస్మయం బంది గిరిజ హరున కిట్లనియె.

157


ఆ.

అతిరహస్యమైన యర్థ మే నడిగెద
ననఘ! నన్నుఁ బ్రీతి నాదరించి
మనమునందుఁ గలుగు ననుమాన మంతయు
మానిపించి నాకు నానతిమ్ము.

158


ఉత్సాహ.

పొరిఁ గపాలభస్మచర్మములును నెముకపేరు లి
ట్లరయ నెల్లశ్రుతులు నింద్య మనుచుఁ జెప్పుచుండఁగా
నెరవు సేయ కవి ధరింప నేమి కారణంబు నీ
చరిత మెల్లఁ జెప్పవలయుఁ జంద్రఖండశేఖరా!

159


వ.

అనిన విని హరుండు గిరిజాతం గనుంగొని యేకాంతంబునం దన
చరిత్రం బంతయుం జెప్పఁదలంచి యిట్లనియె. నీ యడిగిన
యర్థంబు పరమరహస్యంబు గావున నన్యుల కెఱింగింపం దగదు
నీవ నే నగుటం జేసి సవిస్తరంబుగాఁ జెప్పెద నాకర్ణింపుము.

160


సీ.

స్వాయంభువాఖ్యమన్వంతరంబునఁ దొల్లి
      నముచిపురోగదానవులు బాహు
బలసమగ్రులు మహాబల[1]పరిపృతులు ధ
      ర్మాచారరతులు నుదాత్తతేజు
లఘువివర్జితులు శుద్దాంతరంగులు వేద
      శాస్త్రప్రవీణులు సత్యరతులు
తమశక్తి నఖిలలోకములును సాధించి
      నాకంబుపై కేగి నాకవిభునిఁ


తే.

బాఱఁదోలిన నిర్జరప్రభువుఁ గూడి
నిఖిలదివిజులు దుగ్ధాంబునిధికి నేగి
పగతుచేఁ దారు వొందిన పరిభవంబు
లార్తి దోఁపఁగఁ జెప్పిరి హరికి నెలమి.

161
  1. పరిపృతులును, ధర్మచారిత్రు లుదాత్తతేజు (మ-తి)