పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

పద్మపురాణము


క.

ఇవ్విధమున ద్వాదశియం
దెవ్వఁడు పూజించు నతని కీప్సితఫలముల్
నివ్వటిల నిచ్చు నెప్పుడు
నవ్విష్ణుఁడు కమలఁ గూడి యనవరతంబున్.

152

పాషండస్వరూపనిరూపణము :

వ.

అని యివ్విధంబున ద్వాదశీవ్రతమహత్వంబు చెప్పి శంకరుం
డద్రిజం గనుంగొని యింక నేమి విన నిష్టం [1]బడుగు మనిన
నమ్మహాదేవి యిట్లనియె.

153


క.

మును పాషండులఁ జూడం
జనదని చెప్పితిరి వారి చందం బెట్లే
యనువున నే [2]చిహ్నంబుల
తనువుల గలవారు వారిఁ దగఁ జెప్పు శివా!

154


వ.

అని యడిగిన ఫాలలోచనుం డిట్లనియె.

155


సీ.

హరికంటె నొకదైవ మన్యంబు గలదను
       వారలు హరిభక్తిదూరమతులు
బహుళకపాలాస్థిభస్మ[3]లింగాంకులు
       వైదికవిరహితవర్తనులును
ఘనవనప్రస్థితు ల్గాక జటావల్క
       ధారులై చరియించు తాపసులును
బొరిఁ జక్రశంఖోర్ధ్వపుండ్రాంకములు లేక
       హరికథావిముఖాత్ము లైనవారు


తే.

దైవముల విష్ణుసరి గాఁగఁ దలఁచువారు
విష్ణుధర్మంబు గాదని విడుచువారు
నఖిలధర్మంబులును హరియందుఁ జేర్ప
కుండువారలుఁ జువ్వె పాషండు లగజ!

156
  1. బయ్యెడి నడుగు మనిన (హై)
  2. చిహ్నంబులు, తనువున గలవారు వారిదయ జెప్పు శివా (తి-హై)
  3. లింగాంగులు (తి-హై)