పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

పద్మపురాణము


వ.

అని చెప్పి భవుండు పార్వతి కిట్లనియె.

131


క.

సిరికడకన్నుల చూపులఁ
బరమానందమునఁ బొంది పద్మాక్షుఁడు సు
స్థిరకరుణాలోకనుఁడై
పరమమునీంద్రులకు ననియెఁ బరమప్రీతిన్.

132


మ.

వినుఁ డీ యిందఱు లక్ష్మిఁ జూచు తలఁ పువ్విళ్లూరఁగా నిందు నం
దును పోష్యస్థితి నున్నవా రెపుడు నెందు న్మీరు పోషాత్ములై
మునిసేవ్యంబగు ద్వాదశిం దగ నను న్బూజింప [1]నర్థిన్ సనా
తనసౌఖ్యంబులఁ జెంది మత్పదమునందం బాత్రు లెల్లప్పుడున్.

133


వ.

అట్లు గావున నెవ్వరేనియు నఖిలపుణ్యఫలద యగు నేకాదశి నుప
వసించి మత్ప్రియతమ యగు ద్వాదశి నరుణకిరణోదయంబున
సద్భక్తిపూర్వకంబుగా లక్ష్మీసమేతుండగు నన్నుం దులసీ
యుక్తంబుగఁ బూజ గావింతురు వారు సకలపాపనిర్ముక్తులై
మత్పదంబునం బొందుదు రిట్లు సేయని పాపాత్ములు నరకగాము
లగుదురు గావున నేకాదశీవ్రతం బవశ్యం బాచరింపుండని యాన
తిచ్చి వారలచేత నభినందితుండై యప్పరమేశ్వరుండు క్షీరాబ్ధి
కిం జని శేషపర్యంకంబున రమాసమేతుండై దివిజగణసంస్తూయ
మానుండై సుఖం బందుచుండె నంత.

134


చ.

వనజభవాదిదేవత లవారణభక్తిరసానుమోదులై
ఘనబలుఁ గూర్మమూర్తి నధికంబగు పూజలఁ జేసి రప్పు డ
య్యనఘుఁడు మెచ్చి వారిఁ గరుణార్ద్రసమంచితదృష్టిఁ జూచి మీ
మనములనున్న యర్థములు మానుగ నిచ్చెద వేఁడుఁ డిమ్ములన్.

135


ఉ.

నావుడు నమ్మునీంద్రులు మనంబున సమ్మద ముల్లసిల్లఁగా
నావిభుతోడ నిట్లని రనంతకులాచలదిగ్గజంబులు
న్మోవఁగలేక బెగ్గిలె నమోఘగుణోజ్జ్వల! మమ్ము నిందఱం
గావఁగ నీకు పోలు [2]నధికంబుగ నిద్ధర నుద్ధరింపవే.

136
  1. నర్థింపనూ, తన సౌఖ్యంబుల (మ)
  2. నధికంబగు (హై)