పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

253


ఆ.

పుణ్యపురుష! నీవు భువనంబులకు నెల్ల
మాతయైన లక్ష్మిఁ బ్రీతితోడ
నవధరింపవలయు నద్దేవి కడగంట
[1]నఖిలజగము తొంటియట్ల బ్రతుకు.

128


సీ.

అని పల్కి యందఱు నధికసమ్మదమునఁ
         బెనుపారు నవరత్నపీఠియందు
నాదినారాయణు నమ్మహాలక్ష్మిని
         దివ్యభూషణరశ్మిఁ దేజరిల్ల
గూర్చుండఁగాఁ బెట్టి యర్చించి భక్తితో
         నమృతసంభవదివ్యమైన తులసి
నమ్మహాపురుషుని యడుగులు పూజించి
         యతులితధూపదీపాదివిధులఁ


తే.

దనిపి దండప్రణామంబు లొనరఁ జేసి
సంస్తుతింపంగ నప్పుడు [2]జలజనయనుఁ
డిష్టసౌభాగ్యసంపద లిచ్చి సకల
దేవతాకోటిఁ గరుణార్ద్రదృష్టిఁ జూచె.

129


ఉ.

దేవగణంబు దానవులు దేవి యపాంగనిరీక్షణంబులన్
నానిరి సర్వసంపదల వర్ధిలి [3]పొల్చిరి నిత్యసౌఖ్యమై
భూవలయంబు [4]సర్వమును బొంపిరివోయి చెలంగె నున్నత
శ్రీ విలసిల్లె నింద్రుఁడును జెన్ను వహించెఁ బయోరుహాననా!

130
  1. చూచినంతలోన సుఖము నొందు (హై)
    దీని తరువాత "వ॥ తొల్లింటి యట్ల సంతసింపుచు నుండు ని జ్జగంబు లని కరంబులు ఫాలంబుననిల్పి రక్షింపు రక్షింపు
    మనిన" అను అధికపాఠ మున్నది (హై)
  2. జలజనయన, దృష్టిసౌభాగ్యసంపద లిచ్చె నఖిలదేవతాకోటి కరుణార్ద్రదృష్టిఁ జూచి (ము)
  3. రప్పుడు (హై)
  4. సంతసము (మ-తి-హై)