పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

పద్మపురాణము


నే నేమి సేయదు నెచట వర్తింపుదు
         ననిన నా సతిఁ జూచి యమరు లనిరి
కలహ మెవ్వరియింటఁ గలుగు నేమానవు
         లనృతముల్ పరుషంబు లాడుచుండ్రు


తే.

సంధ్యలందును నెవ్వఁడు సల్పు నిద్ర
బొగ్గులును బెంచులును గేశములును నుముక
యేరి వాకిండ్లఁ గన్పించు వారియిండ్ల
[1]నీవు వర్తించు దారిద్ర్యనిబిడనేత్ర!

115


ఆ.

పునుకచయము బూఁదిపూఁత వెండ్రుకత్రాళ్లు
పన్నుగా ధరించుచున్నవాని
యింటఁ గదలకుండు మేప్రొద్దు గెడగూడ
క్రీడ సల్పు మమ్మ! కీడు[2]చేసి.

116


ఆ.

ఒనరఁ గాళ్లు గడుగుకొనకము న్నెలమితో
వార్చునట్టి దుష్టవర్తి యింటఁ
గలియు నీవుఁ గూడి కాపుండి యా కాఁపుఁ
జెలఁగి లేమిపాలు సేయుమమ్మ!

117


ఆ.

కసవు బొగ్గు ఱాయి యిసుక చర్మము పెంచు
నినుము వీనఁజేసి యెవ్వఁ డేనిఁ
బల్లు దోమునట్టి పాపాత్మునిల్లు నీ
యిల్లుగా [3]వసింపు మెల్లనాడు.

118


ఆ.

ఉల్లి తెలికపిండి ముల్లంగి నేబీఱ
పుచ్చ దొండకాయ పుట్టకొక్కు
లూరుఁబిండి మునగ మారేడుగాయల
ట్లనుభవించువారి ననఁగి పెనఁగు

119
  1. నెపుడు వర్తింపు దారిద్ర్యనిబిడకాంత (ము-యతిభంగము)
  2. దలచి (హై)
  3. భజింపు (ము)