పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

249


వ.

ఇట్లు ప్రళయకాలాగ్నితుల్యకరాళంబగు కాలకూటమహావిషం
[1]బుద్భవించి యఖిలజగంబులం జెఱుపం జొచ్చిన నద్దేవముని
దానవసంఘంబులు భయభ్రాంతచిత్తులై [2]కాకువడి నలుగడలఁ
బఱతెంచి నన్ను శరణంబు వేఁడినఁ గనుంగొని యిట్లంటి.

112


మత్తకోకిల.

ఏమి సేయఁగ నేమి పుట్టె నిదేల పాఱెద రార్తులై
యీమహానల మిట్లు [3]వెన్కొన నెందుఁ బోయినఁ బోవునే
నామహత్త్వము చూడుఁ డిందు మనంబుల న్భయ మేదియం
చామహావిష మేను మ్రింగితి నంబుజోదరు లావునన్.

113


వ.

ఇవ్విధంబున నఖిలమంగళస్వరూపుండగు పుండరీకాక్షు నాకా
రంబు మనంబున నిలిపి తన్నామత్రయమంత్రజపపరాయ
ణుండ నగుటయుఁ దన్మాహాత్మ్యంబున నఖిలజగత్సంహారకారణం
బగు నమ్మహావిషంబు నాయంద జీర్ణించె. అమ్మంత్రం బచ్యు
తానంతగోవింద యను నమ్మూడునామంబులునుం బ్రణవాద్యం
బును నమః పదాంత్యంబునుంగా యోజింప నామత్రయంబగు;
నిది నియతాత్ములై యెవ్వరు పఠియింతురు వారికి విషరోగకాల
మృత్యుభయాదులు వాసి శుభంబులు సెందునని యమ్మంత్ర
ప్రభావంబు గిరిజ కుపదేశించి మఱియు నిట్లనియె. అప్పుడు కాల
కూటవిషంబు శాంతం బగుటయు బ్రహ్మాదిదేవమునిసంఘంబు
లును యక్షరాక్షసగణంబులును నన్ను ననేకవిధంబులం బ్రశం
సించి ప్రణమిల్లి మఱియును.

114


సీ.

తఱిమి యంభోనిధిఁ దరువంగఁ దరువంగ
        రక్తమాల్యంబులు రక్తవస్త్ర
ములు దాల్చి జ్యేష్ఠనా ముదిత యొక్కతె పుట్టి
        యమరసంఘముఁ జూచి యల్ల నగుచు

  1. వించిన నఖిలజగంబులు తల్లడిల్లం జొచ్చిన (హై)
  2. చికాకు (తి-హై)
  3. నెక్కొన (హై)