పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

పద్మపురాణము


నేక భంగుల వినుతించిరి. ఇ ట్లుపదేశించి నారాయణుం డంత
ర్ధానంబు నొందెనని చెప్పి శంకరుండు గిరిజ కిట్లనియె. అ ట్ల
మ్మహావిష్ణునియోగంబున దేవాసురానీకంబులు గూడి యమృత
జలధి మథనోద్యోగులై చని చని.

105


క.

ముందట దివిజులు గాంచిరి
మందరమును దివ్యగానమాధుర్యశ్రీ
సుందరము సిద్ధసేవిత
కందరమును గల్పవల్లికామందిరమున్.

106


వ.

కని యత్యంతబలసంపన్నులై యప్పురాణపురుషోత్తముం
దలంచి యమ్మహాశైలం బతిరభసంబునం బెఱికి మోసికొనివచ్చి
దుగ్ధపయోరాశియందు [1]మహాఘోరంబుగా వై చిన.

107


ఉ.

శ్రీవిభుఁ డవ్యయుం డమరసేవ్యుఁడు నిర్మలకూర్మరూపమై
దేవహితార్థమై పరఁగ దివ్యజవంబున మందరంబు క్రిం
దై వెస వీపుమీఁదను రయంబునఁ దాలిచె గెంటకుండఁగాఁ
దా వలచేత నూఁది బెడిదంబగు నగ్గిరి నద్భుతంబుగన్.

108


ఆ.

కణఁగి యమ్మహాద్రి కవ్వంబు [2]గాఁ జేసి
దందశూకవిభునిఁ ద్రాడు చేసి
తఱిమి పట్టి దేవదానవసంఘంబు
ద్రచ్చి రంబురాశిఁ బెచ్చువెఱిగి.

109


వ.

ఇట్లు కార్తిక శుద్ధ ఏకాదశి నొండొరులకు [3]నోరవోక శ్రీమంత్రంబు
జపించుచు ననంతజవసత్వంబుల మథించు నప్పుడు.

110


క.

ఘోరాగ్నికణము లురుల మ
హారవమున భగ్గుభగ్గుమని పెనుమంటల్
బోరున నల్గడ నెగయఁగ
దారుణముగ విషము పుట్టి దరికొనఁ జొచ్చెన్.

111
  1. మహాఘోషంబుగా (మ-హై)
  2. గావించి (మ-తి-హై)
  3. మేర (హై)