పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

పద్మపురాణము


తే.

[1]ఇట్టి యుత్పాతముల మన కెల్లయెడల
నుడుప నారాయణుఁడె కాక యొక్కరుండు
గలఁడె యటుగాన దుగ్ధాబ్ధినిలయుఁడైన
యతని నర్చింత మచ్చటి కరిగి మనము.

98


క.

అతఁడు ప్రసన్నుం డగుటయు
నతిశయముగ జగము తొంటి యట్టుల సౌఖ్య
స్థితి నుండు నట్లు గావున
మతి నిది నిశ్చయము రండు మన కందఱకున్.

99


వ.

అని విచారించి బ్రహ్మయు నింద్రాదిదేవతలును భృగుభరద్వా
జాదిమహామునులును యక్షకిన్నరగంధర్వపన్నగాదులును
దేవయోనులును వసురుద్రాదిత్యులును జనుదెంచి సకలసౌభాగ్య
రమ్యంబగు నమృతపయోధి యుత్తరతటంబున నందఱు నయ్యై
విధంబులం బురుషసూక్తవిధానంబుల నర్చించి యష్టాక్షర
మంత్రజపంబులను నానావిధస్తోత్రంబుల ననన్యచిత్తులై నారా
యణదేవు ననవరతంబునుం గొలుచుచుండ నద్దేవతల ముందట.

100


సీ.

శ్రీవత్సకౌస్తుభచిహ్నితోరస్స్థలుం
        డతులితపుండరీకాయతాక్షుఁ
డిందీవరశ్యామసుందరగాత్రుండు
        హాటకరుచిరపీతాంబరుండు
కనకకుండలకాంతిగండస్థలుండును
       నురురత్నఘనకిరీటోజ్జ్వలుండు
సురుచిరకటకనూపురహారభూషితుం
       డనుపమరూపయౌవనవిలాసుఁ

  1. ఇట్టి యుత్పాతమణగంగ నేది మనకు, దిక్కు నారాయణుడ కాక యొక్కరుండు (మ-హై)