పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

245


వ.

ఇట్టి జగదుత్పాతనిమిత్తంబునకు సకలజనంబులు భయభ్రాంత
చిత్తులై మునుల కెఱింగించిన వారలు దేవతల కత్తెఱంగు
చెప్పిన విని యింద్రాదిదేవతలును మునులునుం గమలసంభవు
పాలికి వచ్చి దైన్యంబు దోఁపం బ్రణమిల్లి యవ్విధం బంతయు
నెఱింగించి యిట్లనిరి.

91


ఉ.

ఈనిఖిలోర్వియుం దలఁప నిందిర[1]చూడ్కిన వృద్ధిఁ బొంది సొం
పూనుట నట్టి లచ్చి వెలివోవుటఁ జేసి జగంబు లాఁకటన్
దీనతమై నశించెఁ బితృదేవగణంబులు హవ్యకవ్యసం
తానము లేమిఁజేసి ప్రమదంబఱి చేష్టలు దక్కి రెంతయున్.

92


క.

ఆఁకటను నీరుపట్టున
వీఁక చెడి నశింపఁ జొచ్చె విశ్వం బెల్లన్
దేఁకువ చెడకుండఁగ నీ
వీకఱ వెడలించి కావు విమలవిచారా!

93


వ.

అని విన్నవించిన దేవసంఘంబులం గనుంగొని పితామహుం
డిట్లనియె.

94


క.

సురలార! వినుఁడు చెప్పెద
సురపతి దుర్వాసుపేర్మిఁ జూడ కవజ్ఞా
పరుఁడైన నతనికతమున
భరమై భువనముల కెల్లఁ బ్రళయము వచ్చెన్.

95


ఆ.

అగ్నికల్పుఁ డైన యమ్మహాముని నవ
మానితాత్ముఁ జేయ మండి యతఁడు
శాపమిచ్చె నంత నీపాటు వాటిల్లె
జగములెల్ల బెగడ సడలె లక్ష్మి.

96


మ.

ఆ కంజాలయ విష్ణువల్లభ నిజాపాంగేక్షణోద్భూతలీ
లాకారుణ్యమునన్ జగంబులకు నుల్లాసం బొనర్చున్ దదా
లోకం బిప్పుడు లేమిచే నతిభయాలోకంబులై యున్నవి
ట్టీకీడ్పా టుడుపంగ వెజ్జుగలఁడే యేభంగులం జూచినన్.

97
  1. చూడ్కి సమృద్ధి బొంది (హై)