పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

పద్మపురాణము


ఆ.

అణఁగె నంతనుండి యఖిలలోకంబుల
సకలధర్మములును సంచలించె;
దిక్కు నీవకాక యిక్కార్యమంతయు
నరసి ప్రోవ నెవ్వ రంబుజాక్ష!

80


క.

జగములకు భూతరాశికి
నిగమంబులయూఁత గాన నిగమము లణఁగన్
జగమెల్ల నణఁగుఁ గావున
నిగమాత్మక! వానిఁ జంపి నిగమము లీవే.

81


వ.

అనిన నద్దివ్యపురుషుండు వారల కభయం బిచ్చి యాప్రొద్ద కదలి
యతిభీషణరోషావేశంబున మహామత్స్యరూపంబుఁ దాల్చి [1]వనధి
గలంగి పిండలి వండుగునట్లుగాఁ బఱతెంచి తాఁకిన నయ్యిరువుర
కుం బోరు ఘోరంబయ్యె నయ్యవసరంబున.

82


లయవిభాతి.

బెడిదమగు తుండముల వడిఁ బెనఁచి యొండొరుల
         నొడిసి వెసఁ బట్టుకొని పుడమి యద్రువంగా
వెడవెడను నార్చుచును దడఁబడఁగ వ్రేయుచును
         వెడలు రుధిరంబు దివిఁ గడలుకొనఁ బై పై
నుడుగణము డుల్లిపడ జడనిధి గలంగ జవ
         మెడల కసమానగతిఁ గడఁగు పెనుదై త్యుం
దొడరి వెసఁ బుట్టుకొని మిడికిపడనీ కడరి
         నడుము దెగఁబాఱి తొడిఁ బడనడిచి చంపెన్.

83


వ.

ఇవ్విధంబున నవ్విరోధిం బరిమార్చి వానియుదరంబునందు
నున్న యామ్నాయంబులు పుచ్చుకొని యమ్ముకుందుండు
చనుదెంచి బృందారకబృందంబు లందంద స్తుతియింప నన్నిగ
మంబు లంబుజాసనున కిచ్చె; నన్యోన్యమిశ్రితంబులగు వేద

  1. మహానక్రఝషశింశుమారప్రముఖో .... ....ల బహుళంబగు నంబురాశి ప్రవేశించి మందరాద్రిచందంబున గలచి యాడ నంత నద్దురాత్ముండును మహామకరరూపంబును దాల్చి వనధి (తి-హై)