పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

241


యోగివర్యుల్ సదా ధ్యానసంపన్నులై మౌనులై వల్లవాహారులై
కామినీదూరులై సర్వభోగంబులున్ మాని రాగంబులు న్మాని
హృత్పద్మమధ్యంబునం జిన్మయాకారునిం జూచిరే గాక కామంబు
నేమంబుగాఁ గొన్న మాబోఁటు లెబ్భంగి ని న్నందగా నేర్తు
రంభోజనేత్రా! జగన్మిత్ర! నీసత్కృపాలోకనారూఢి లేకున్న
లోకంబులెల్లన్ నిరాకారతం బొంద నింద్రాదిబృందారకుల్‌ గూడి
నీపాదపంకేజసంసేవనోద్యుక్తులై [1]వచ్చినా; రిట్టిచో నిద్ర
మేల్కాంచి మాపాటు లాలించి మమ్ముం దయాపూర్ణదృష్టిం
గటాక్షించి! రక్షింపు! లక్ష్మీకుచాలింగనోద్భాసివక్షస్స్థలా!
కైటభారీ! నమస్తే! నమస్తే! నమః!

76


క.

తరుణాంబుజదళలోచన!
కరుణామృతపూర్ణహృదయ! ఘనదితిసుతసం
హరణా! సురమునిసేవిత
చరణా! రిపుకంఠదళన! చక్రాభరణా!

77


వ.

అని యి ట్లనేకప్రకారంబుల స్తుతించు పద్మాసనాదిబృందారకుల
వాక్యంబులు విని పద్మనాభుండు నాగపర్యంకతలంబునం
గూర్చుండి వారలం గరుణార్ద్రదృష్టిం గనుంగొని కుశలం బడిగి
యాగమనప్రయోజనం బెఱింగింపుం డనినం గమలభవుం డిట్ల
నియె.

78


ఉ.

ఏమని విన్నవింతు జగదీశ్వర యెన్నఁడు లేని మాట [2]కా
సోమకుఁ డెల్లలోకములఁ జూరలు వుచ్చియు నంతఁబోక యు
ద్దామబలాఢ్యుఁడై నను ముదంబఱ మూర్ఛితుఁ జేసి నాశ్రుతి
స్తోమముఁ [3]గొంచుఁబోయి కడుదుర్మతియై [4]మకరాకరంబునన్

79
  1. వచ్చి యున్నారు నీ నిద్ర (మ-హై)
  2. లా (తి-హై)
  3. గొంచుబోయె (తి-హై)
  4. యిక యేమి చెప్పుదున్ (హై)