పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

పద్మపురాణము


పవ్వళించి చాఁచిన చరణంబులు సిరి తొడలపై నిడుకొని [1]మెత్తన
యొత్త నారదాదిమునుల దివ్యగానంబులు చెలంగ నిద్ర మేల్కని
యరవిరితమ్మిఱేకులం దెగడు గనుదమ్ముల [2]నద్దేవతలం జూచి
యల్లన నగుచున్న యన్నీలవర్ణుం గనుంగొని సాష్టాంగదండ
ప్రణామం బాచరించి నిటలతటఘటితాంజలులై [3]యిట్లని స్తుతి
యించిరి.

75


దండకము.

శ్రీనాథ! నీలామనోనాథ! భూనాథ! మూర్తిత్రయీనాథ!
చక్రాంక! శేషాహిపర్యంక! కాలత్రయాతీత[4]లోకైకవర్తీ!
మృగాధీశమందాకినీహారమందారనీహారధామాభ్రవేదండ
డిండీరకర్పూరకైలాసకాశస్ఫురత్కీర్తిదిక్చక్రపూర్తీ! హరీ!
వాసుదేవా! మురారీ! మహాశైలధారీ! యనంతాచ్యుతా!
మాధవా! కృష్ణ! గోవింద! పద్మోదరా! పద్మపత్రేక్షణా! దేవ
దేవా! భవత్పాదపంకేజసంసేవనం గోరి యున్నార మిన్నీరధి
న్నీవు [5]దేల్చున్న నీచంద మెవ్వారు వర్ణింపగా నేర్తురయ్యా!
జగజ్జాలము న్లీలఁ బుట్టింప రక్షింపఁగా నీవ శిక్షింపగా నీవ కా
కన్యుఁ డొక్కం డిలం గల్గునే సర్వలోకాత్మ! భూతాత్మలం దుండి
సూక్ష్మ[6]స్వరూపంబులై నీవ వర్తింతు. నీ మూర్తితో సర్వ
లోకంబులం బొంది యిచ్ఛాగతిం జెందియుండంగ లీలాగతి న్నీవు
మఱ్ఱాకుపై బాలలీల వ్వినోదింతు నీ యంతరం బింత యంతంత
నన్ రాక లోకంబులెల్ల న్భవన్మాయచేఁ జిక్కియుండంగ నేరూప
మేప్రాయ మేపాక మేరీతి యే భాతిగా నిన్ను రూపింప
వచ్చున్ బరంజ్యోతి! వీ వాదిమధ్యాంతహీనుండ వంచున్ మహా

  1. మెల్లన (హై)
  2. నద్దేవిం (మ-హై)
  3. యిట్లనిరి (ము)
  4. త్రైలోక్యవర్తీ సదానందమూర్తీ (హై)
  5. దేలున్న చందంబు లెవ్వారు (మ-హై)
  6. స్వరూపంబవై విశ్వచైతన్యమై (హై)