పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

పద్మపురాణము


చ.

అనఘచరిత్ర! విష్ణుకథయంతయు నీదయ వింటి [1]నెమ్మదిన్
దనివి యొకింతలేదు; హరి దానవకోటుల నేమి కార్యమై
తునిమె? దశావతారములు దూఁకొనఁ గారణమేమి? యంతయున్
వినఁగ నభీష్టమయ్యెడి సవిస్తరభంగి నెఱుంగఁ జెప్పవే.

67


వ.

అనిన గౌరికి శంభుం డిట్లనియె.

68

శ్రీవిష్ణుదేవుని మత్స్యావతారకథనము :

క.

విను! మత్స్యాద్యవతారము
లనఘచరిత్రములు వైభవావస్థలు నాఁ
జను నవి హరివంశములై
యొనరుం దీపమున దీప ముదయించు గతిన్.

69


వ.

[2]పరావస్థాసమర్థుండగు పరమపదనాథునకు వ్యూహాదులు నవతా
రంబులు విభవంబులగు; నప్పరమేశ్వరుం డయ్యైకాలంబుల
వలసినట్ల విహరించుం గావున నవతారంబులు [3]తాత్కాలికంబు
లనంబడు; నది యెట్లనిన నారాయణు నాభికమలంబున నుద
యించి శతానందుండు సృష్టికర్తలగు భృగు మరీచ్యత్రి దక్ష
కర్దమ పులస్త్య పులహ క్ర త్వంగిరసు లనఁగా నవబ్రహ్మలం
బుట్టించె. అందు మరీచికిం గశ్యపుం డుదయించె. అక్కశ్యపు
నకు నదితి దితి కద్రువ వినత యనంగా నలువురు భార్యలు గలి
గిరి. వారియం దదితికిం బృందారకు లుదయించిరి. దితికి
ఘోరాకారులైన సోమకుండు హయగ్రీవుండు హిరణ్యాక్షుండు
హిరణ్యకశిపుండు జంభుండు [4]మయుండు నన నార్వురు పిశితా

  1. నా మదిన్, తనివొక యింతలేదు (హై)
  2. విను మవ్యక్తుం డనంతుం డచ్యుతుం డనంబరగు పరబ్రహ్మ యందు పుట్టిన పరమపదనాథునకు వ్యూహాదులు నర్చావతారంబులు విభవంబులగు (హై)
  3. దత్కలితంబు లనంబడు (ము), తత్కార్యంబు లనంబడు (హై)
  4. మలయుండు (ము)