పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

237


తే.

దనదు కడగంటిచూపులు దనరి కమల
భవభవాదుల కున్నతపదవు లొసఁగఁ
బద్మవాసిని కనకంపుఁబ్రతిమ యసఁగ
దివ్యసుఖలీల నొంది వర్తించు నెపుడు.

60


తే.

మానితంబగు దివ్యవిమానవితతిఁ
జెలఁగి కిన్నరచారణసిద్ధవరులు
పరమతాత్పర్యమున లక్ష్మిఁ [1]బ్రస్తుతింతు
[2]రడరి సమ్మదబాష్పంబు లడరుకొనఁగ.

61


క.

అభవకమలాసనాదులు
విభవం బఱి దనుజబాధ వినిపించుచుఁ ద
న్నభినుతులు సేయ వారల
కభిమతముల నిచ్చు దానవాంతకుఁ డచటన్.

62


వ.

అని చతుర్విధవ్యూహప్రకారంబు లెఱింగించి శంభుండు.

63


క.

వనజభవాదులకై నను
వినిపింపఁగ నలవిగాని విష్ణుపదంబుల్
విను సంక్షేపంబున నే
వినిపించితి నెఱిఁగినంత విమలేందుముఖీ!

64


క.

ఈహరివిలాసనిలయ
వ్యూహాఖ్యానంబు వినిన యుత్తములకు న
వ్యాహతసౌఖ్యము లధిక
స్నేహంబున నిచ్చుచుండు శ్రీవిభుఁ డెపుడున్.

65


వ.

అని విష్ణులీలామందిరంబులగు చతుర్వ్యూహంబుల నెఱింగించి
పార్వతిం గనుంగొని యింక నేమి విన నిష్టంబుగల దడుగుమనిన
నమ్మహాదేవి పతికి నిట్లనియె.

66
  1. పాడుచుంద్రు (తి)
  2. కడగి సమ్మదబాష్పముల్ గడలుకొనఁగ (తి-హై)