పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

229


విభూషణదివ్యమాల్యాంబరానులేపనవిరాజమానులును విష్ణు
ప్రతిమానరూపులగు దివ్యపురుషులును గలిగి విలసిల్లు నందు.

27


సీ.

పొంది క్రమ్మఱి రాక భోగసంపన్నులై
       హరిమ్రోలఁ [1]బాడుచు నాడువారు
విష్ణుసన్నిధి నిల్చి వెలయు నవ్విభునట్ల
       నిత్యసౌఖ్యంబుల నెగడువారు
స్వర్గవైభవములు సరుకుగాఁ గొనకయు
       నవ్యయానందంబు లందువారు
కర్మబంధంబులఁ గడతేర్చి [2]గోవింద
       భక్తినిత్యాత్ములై పరఁగువారు


ఆ.

గలిగి సకలలోకఫలభోగనిలయమై
యజభవామరులకు నందరాక
శ్రీవిహారలీలఁ జెన్నొంది మిన్నందు
ధన్యసౌఖ్యకరము తత్పురంబు.

28


వ.

తన్మధ్యప్రదేశంబున సూర్యకోటిప్రకాశంబై వివిధమణిస్తంభం
బులు గలిగి చెలువొందు దివ్యవిమానంబు నందు నాధారశక్తి
యుక్తంబగు హిరణ్మయపీఠంబునం దష్టదళకమలంబు మంత్ర
బీజాక్షరరమ్యంబై పొలుచుఁ; దత్కర్ణికను లక్ష్మి నీలాయుక్తయై
యుండు; నందు శంఖచక్రగదాపద్మహస్తారవిందుండును
గేయూరకటకాంగుళీయక కుండలకిరీటాలంకారుండును దివ్య
మాల్యానులేపనవిరాజితుండును కోటికోట్యర్కదేదీప్యమానుం
డును నగు నారాయణుండు సుఖాసీనుండై యుండు నద్దేవు
దక్షిణభాగంబున నఖిలరత్నకిరణపరికరపరివృతాలంకారయు
దివ్యచందనమాల్యాంబరధారిణియుఁ గనకకమలమాతులుంగ
సువర్ణపాత్రాభయహస్తాంబుజయునగు మహాలక్ష్మి సుఖాసీనయై
యుండు మఱియును.

29
  1. నాడుచుఁ బాడువారు (ము-యతిభంగము)
  2. బోధింప (ము)